Medchal–Malkajgiri/Medchal (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, నిర్మల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల హరీష్ నేతృత్వంలో ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమం ఊపందుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో పర్యటించి, ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, నిర్మల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల హరీష్ నాయకత్వంలో ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమంలో భాగంగా గాంధీ నగర్, నాయడివాడ, బంగల్ పెట్, వెంకటాద్రిపేట్, బ్రాహ్మణ పూరి, చింతకుంటావాడ, మదిన కాలనీతో పాటు పలు వార్డులలో పర్యటించడం జరిగింది.
రోజువారీగా ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ, కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ (BLA)లు, సూపర్వైజర్లను అడిగి, వార్డుల వారీగా నమోదవుతున్న పురోగతిని సమీక్షిస్తానని పట్టణ అధ్యక్షులు ఆకుల హరీష్ తెలిపారు. రోజువారీగా పట్టణంలోని వివిధ బూతులలో చేపట్టిన పనులు, వచ్చిన దరఖాస్తులు, ఇతర సమస్యలపై నివేదిక రూపంలో డీసీసీ కార్యాలయానికి సమర్పిస్తానని ఆయన తెలియజేశారు.
ఇప్పటివరకు జరిగిన పురోగతిని తెలుసుకున్నారు. దాదాపు 100% నమోదు కోసం కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు అందరూ తప్పకుండా ప్రతీ ఇంటికీ వెళ్లి విషయాలు తెలియజేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఆగిపోకుండా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటరు నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబడి రాజేశ్వర్, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి, మాజీ జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి దశరథ్ రాజేశ్వర్, ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్, డీసీసీ జనరల్ సెక్రటరీ జునైద్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ మతీన్, కిజర్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అహ్మద్ ముక్తార్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాయి ప్రతాప్ నాయుడు, ఓబీసీ ప్రధాన కార్యదర్శి సంతోష్, ఆకుల నర్సయ్య, అంబాజి రాథోడ్, అమెడ శ్రీధర్, వాసవి, లక్ష్మి, గీత, గాంధీనగర్ వార్డ్ 01 కౌన్సిలర్ కత్తి నరేందర్, మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












