ములుగు, 27-07-2026
వాజేడు మండానికి చందిన కాంగ్రస్ పార్టీ సీనియర్ నాయకుడు దంుూరి విశ్వనాథ ప్రసాద్ బాబు రాజు (ప్రసాద్ బాబు) ఆకస్మిక మరణం పట్ స్థానిక ఎమ్మ్యే డాక్టర్ ్ం వంకట్రావు గారు ప్రగాఢ సంాపం వ్యక్ం చేశారు. ఆయన పార్థివ దేహానికి పూమాు వేసి నివాళుర్పించి, కుటుంబ సభ్యును పరామర్శించారు.
వాజేడు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దంతులూరి విశ్వనాథ ప్రసాద్ బాబు రాజు (ప్రసాద్ బాబు) ఆకస్మిక మరణం పట్ల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మాట్లాడుతూ, ప్రసాద్ బాబు రాజు గారి మరణం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా వాజేడు మండల కాంగ్రెస్ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం, ప్రజా సేవ కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
ప్రసాద్ బాబు రాజు గారు ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మెలుగుతూ, పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలను స్మరిస్తూ నివాళులర్పించిన ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ప్రసాద్ బాబు రాజు గారికి ఘనంగా నివాళులర్పించారు.












