నిర్మల్, 27 July
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత, విద్యార్థుల ఐక్య పోరాటానికి నిదర్శనమని ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల స్వరం ఎంత శక్తివంతమైనదో ఈ పరిణామం మరోసారి నిరూపించిందని ఆయన సోమవారం పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత, విద్యార్థుల ఐక్య పోరాటానికి నిదర్శనమని ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల స్వరం ఎంత శక్తివంతమైనదో ఈ పరిణామం మరోసారి నిరూపించిందన్నారు.
విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వారి భవిష్యత్తుతో చెలగాటమాడే విధానాలను దేశ యువత ఎప్పటికీ సహించబోదని అన్నారు. యువత ఆవేదన, విద్యార్థి సంఘాల ఆందోళనలు, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో అధికార అహంకారానికి స్థానం లేదని, ప్రజల అభిప్రాయాలను గౌరవించని ఏ ప్రభుత్వమైనా ప్రజల తీర్పు ముందు తలవంచక తప్పదని గోవింద్ నాయక్ అన్నారు. విద్యార్థుల హక్కులు, విద్యారంగ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
గతంలో మోదీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమించారని ఆయన గుర్తుచేశారు. రైతుల ఐక్య పోరాటం ముందు చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని గోవింద్ నాయక్ పేర్కొన్నారు.












