సారాంశం
కుంటాల మాజీ ఎంపీపీ జీవి రమణారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ కు వినతిపత్రం
ముఖ్య విషయాలు
- 1రమణరావు మాట్లాడుతూ, రహదారి పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు.
- 2ఈ కార్యక్రమంలో అందకూర్ సర్పంచ్ ప్రశాంత్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు లింగారం పటేల్, కార్యకర్తలు, అందకూర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
- 3కుంటాల మండలంలోని అందకూర్–బామని గ్రామాల మధ్య రహదారి అధ్వాన్నంగా మారడంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు స్థానిక నాయకులు వినతిపత్రం అందజేశారు.
- 4ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు.
కుంటాల మండలంలోని అందకూర్–బామని గ్రామాల మధ్య రహదారి అధ్వాన్నంగా మారడంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు స్థానిక నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జి.వి. రమణరావు మాట్లాడుతూ, రహదారి పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు.
ఈ కార్యక్రమంలో అందకూర్ సర్పంచ్ ప్రశాంత్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు లింగారం పటేల్, కార్యకర్తలు, అందకూర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.