మిర్యాలగూడ, జూలై 4
మి్యాలగూడ మున్సిపాలిటీ పిధిలో 23 కొత్త పొదుపు సంఘాలను ఏ్పాటు చేయడానికి ప్భుత్వం అనుమతి మంజూు చేసిందని మున్సిపల్ కమిషన్ న్ా శ్ీజాడ్డి తలిపాు. పట్టణస్థాయి బ్యాంక్‌ల కమిటీ సమావేశం శనివాం ని్వహించిన సంద్భంగా ఆమ ఈ వివాలు వల్లడించాు. ఈ సంద్భంగా బ్యాంకు లింకేజీ కింద 350 సంఘాలకు 50.70 కోట్ల ూపాయల లక్ష్యాన్ని ని్దేశించినట్లు తలిపాు.
మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో పట్టణస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి మాట్లాడుతూ, మూడు నెలలకు ఒకసారి పట్టణస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహిస్తామని, ఈ సంవత్సరం ఇది మొదటి సమావేశమని తెలిపారు.
మిర్యాలగూడ పట్టణానికి కొత్తగా 23 పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, ఇప్పటివరకు పట్టణంలో ఐదు సంఘాలు మాత్రమే ఏర్పాటు చేయబడిందని ఆమె పేర్కొన్నారు. బ్యాంకు లింకేజీ కింద ఈ సంవత్సరం 350 సంఘాలకు 50 కోట్ల 70 లక్షల రూపాయల టార్గెట్ నిర్దేశించారని తెలిపారు.
మెప్మా పరిధిలో ఇప్పటివరకు 44 సంఘాలకు ఏడు కోట్ల 31 లక్షల రూపాయల మేర లక్ష్య సాధన జరిగిందని, ఇది మొత్తం లక్ష్యంలో 14 శాతమని కమిషనర్ వివరించారు. పి.ఎం. స్వానిధి పథకం కింద ఈ సంవత్సరం 850 మంది కొత్త వీధి వ్యాపారులను గుర్తించి వారికి రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం ఆదేశించగా, ఇప్పటివరకు 500 మంది వీధి వ్యాపారులను గుర్తించి బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడం జరిగిందని తెలిపారు. 50 వేల రూపాయల పి.ఎం. స్వానిధి రుణం పొందిన వారికి 30 వేల రూపాయల క్రెడిట్ కార్డు సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు.
బ్యాంక్ అధికారులు సూచించిన విధానం ప్రకారం, ప్రతి నెలా ప్రతి బ్యాంకులో సీబీఆర్‌ఎం కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని, అక్కడికి మెప్మా రిసోర్స్ పర్సన్స్ తప్పనిసరిగా హాజరై, బ్యాంకుల్లో ఉన్న పొదుపు సంఘాల రికవరీలను తక్షణమే చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మెప్మా డిఎంసీ డి. శివాజీ నాయక్, టీఎంసీ బక్కయ్య, కమ్యూనిటీ ఆర్గనైజర్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సతీష్, టీఎల్ఎఫ్ ప్రతినిధులు మరియు వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.











