Sri Sathya Sai/Chilamathur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 06
బహ్రెయిన్‌లోని దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తోట నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై కోస్ట్ గార్డ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి, కుటుంబసభ్యులకు సమాచారం అందించాయి.
బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి చెందారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తోట నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కోస్ట్ గార్డ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించాయి.
బహ్రెయిన్‌లోని మహమ్మద్ అహ్మద్ కో (MAC) సంస్థలో శ్రీనివాస్ 2019 నుంచి పనిచేస్తున్నారు. శ్రీనివాస్ మృతి పట్ల MAC సంస్థ యాజమాన్యం సంతాపం ప్రకటించింది.












