హైదరాబాద్, జులై 01
జపాన్ ప్రధాని సనాయే తకైచీ బుధవారం సాయంత్రం భారత్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన జూలై 3 వరకు కొనసాగుతుంది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు.
జపాన్ ప్రధాని సనాయే తకైచీ, బుధవారం సాయంత్రం భారత్ పర్యటనకు రానున్నారు. ఆమె భారత పర్యటన జూలై 3 వరకు కొనసాగుతుంది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి.
ఈ పర్యటనలో భాగంగా, ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు. భారత్, జపాన్ల మధ్య ఇది 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం. గత సంవత్సరం ప్రధాని మోదీ టోక్యోలో పర్యటించగా.. ఈసారి భారత్ ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది. ప్రతి సంవత్సరం ఈ రెండు దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం సంప్రదాయంగా మారింది.
గత సంవత్సరం టోక్యోలో జరిగిన సమావేశంలో రాబోయే పదేళ్లలో భారత్లో 10 ట్రిలియన్ యెన్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పర్యటనలో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా స్పష్టమైన పురోగతి సాధించడంపై చర్చలు జరిపే అవకాశం ఉంది. టయోటా సుషో, ఇటోచు, సుజుకి వంటి ప్రధాన జపనీస్ కంపెనీల ఉన్నతాధికారులు కూడా తకైచీతో పాటు భారతదేశానికి రానున్నారు.
ఇరు దేశాల పారిశ్రామికవేత్తల మధ్య ఒక ఉన్నత స్థాయి వ్యాపార సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. రక్షణ రంగంలో సహకారం కూడా చర్చలో ఒక కీలక అంశంగా ఉంటుంది. గతేడాది ఇరు దేశాలు భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి అంగీకరించాయి. ఈసారి ఉమ్మడి రక్షణ ఉత్పత్తులు, సముద్ర భద్రత, నౌకాదళ సహకారం, ఇరు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సహకారం ఇరు దేశాలకు వ్యూహాత్మకంగా కీలకంగా మారింది.












