బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం తలమడుగు మండలంలోని పల్లి బి గ్రామంలో పర్యటించారు. బీడి కార్మికులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని కల్వర్టుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం తలమడుగు మండలంలోని పల్లి బి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీడి కార్మికులతో ముచ్చటించారు. తిరుగు ప్రయాణంలో వీధిలో కూర్చొని బీడీలు చేస్తున్న మహిళలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సరదాగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలోని కల్వర్టులను పరిశీలించి, వాటి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి మొట్టే కిరణ్, నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, అబ్దుల్లా, శ్రీనివాస్, సుంకిడి సర్పంచ్ ప్రకాష్, మున్న, కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











