హైదరాబాద్, 1 July
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పంచాయతీ రాజ్ శాఖ హ్యామ్ ద్వారా బీటీ రోడ్లు మంజూరు చేసినందుకు గాను, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా, కొన్ని ప్రాంతాల్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి మంత్రికి వినతి పత్రం అందజేశారు.
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, కడెం, పెంబి, జన్నారం మండలాల్లో పంచాయతీ రాజ్ శాఖ హ్యామ్ ద్వారా బీటీ రోడ్లు మంజూరు చేసినందుకు గాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా, పెంబి, అల్లంపల్లి నుండి ఇస్లాంపూర్ వరకు కలెక్టర్‌తో కలిసి పర్యటించి గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.











