మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 30
ముప్కాల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026 విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు 100 మంది కొత్త విద్యార్థులు చేరారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 150 మంది విద్యార్థులను చేర్పించాలనే లక్ష్యంతో పాఠశాల యాజమాన్యం ముందుకు సాగుతోంది.
ముప్కాల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటివరకు కొత్తగా 100 మంది విద్యార్థులు చేరినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. గంగారాం తెలిపారు.
ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 150 మంది కొత్త విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని తెలిపారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంపై పాఠశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు, ప్రవేశాల బాధ్యులు రాజా సురేష్, కనకాద్రి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.











