మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 11
మెండోరా మండలం వెలుగటూర్ గ్రామానికి చెందిన ఏరేటి నర్సారెడ్డి (35) అతిగా మద్యం సేవించడం, ఫిట్స్ సమస్యతో మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తులో ఈ వివరాలను వెల్లడించారు.
మెండోరా మండలం వెలుగటూర్ గ్రామానికి చెందిన ఏరేటి నర్సారెడ్డి (35) మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నర్సారెడ్డి ఈ నెల 9వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో అతడు అతిగా మద్యం సేవించే అలవాటు కలిగి ఉండటంతో పాటు ఫిట్స్ (మూర్ఛ) సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అధిక మద్యం సేవించడం వల్ల ఏర్పడిన అనారోగ్య సమస్యలు, మతిస్థిమితం కోల్పోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి అనంతరం మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై సుహాసిని తెలిపారు.












