నిర్మల్, 2023-07-10
ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు 'మీ ప్రమాణం' యాప్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగుల హాజరు, పనితీరును పర్యవేక్షించే సమగ్ర డ్యాష్‌బోర్డ్ వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఈ యాప్ ద్వారా రెవెన్యూ, మీ-సేవ, వైద్య, విద్య వంటి 70–80 శాతం ప్రభుత్వ సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.
ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు 'మీ ప్రమాణం' యాప్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగుల హాజరు, పనితీరును పర్యవేక్షించే సమగ్ర డ్యాష్‌బోర్డ్ వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఎస్డీ కమిషనర్ రవికిరణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ, మీ-సేవ, వైద్య, విద్య తదితర శాఖల 70–80 శాతం సేవలను ఈ యాప్‌తో అనుసంధానం చేసి ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం వివిధ శాఖలు వేర్వేరు యాప్‌ల ద్వారా ఉద్యోగుల హాజరును నమోదు చేస్తున్నందున, అన్ని శాఖల హాజరు వివరాలను ఒకే డ్యాష్‌బోర్డ్‌లో సమీకరించి ఉద్యోగుల హాజరు, విధుల నిర్వహణ, పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆగస్టు 15 నాటికి ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చి, ప్రభుత్వ ఉద్యోగుల హాజరు, పనితీరు పర్యవేక్షణలో నిర్మల్ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఈడీఎం నదీమ్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.











