సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ఆశ్రమ పాఠశాలను ఎంపీడీవో లక్ష్మీకాంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం తప్పనిసరిగా భోజనం అందించాలని ఆయన సూచించారు.
స్టాక్ రికార్డులను పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల పరిశుభ్రతను కూడా పరిశీలించారు. రాత్రి వేళల్లో విద్యార్థులకు చదివించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వార్డెన్ మంగీలాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.











