మంచిర్యాల జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో 15 రోజుల పాటు జరిగే జాతీయస్థాయి శిక్షణకు ఎంపీపీ ఎస్ ఆర్కేపల్లి భీమారం మండలం ప్రధానోపాధ్యాయురాలు దరిపెల్లి స్వరూప ఎంపికయ్యారు. ఈ ఎంపిక మంచిర్యాల జిల్లాకే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ ట్రైనింగ్, న్యూఢిల్లీలో (CCRT, NEW DELHI, DWARAKA) 15 రోజుల పాటు జరిగే జాతీయస్థాయి శిక్షణకు ఎంపీపీ ఎస్ ఆర్కేపల్లి భీమారం మండలం ప్రధానోపాధ్యాయురాలు దరిపెల్లి స్వరూప ఎంపికయ్యారు.
ఈ శిక్షణలో జాతీయ కళలు, సంస్కృతి, వారసత్వ సంపద, జానపద కళారూపాలు, సంస్కృతి-సాంప్రదాయాల ఆధారిత బోధన విధానాలపై, అలాగే పప్పెట్రి ప్రోగ్రాం ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, NEP-2020 వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించే అంశాలపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు.
'గోగు పూలు', 'చైతన్య బావుటా', 'ఆర్కేపల్లి బాలల కథలు', 'పొరక', 'తక్కెడ' పుస్తకాల రచయిత, కవయిత్రి అయిన దరిపెల్లి స్వరూప తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఈ కార్యక్రమానికి ఎంపికవడం మంచిర్యాల జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు.
భీమారం మండల విద్యాశాఖ అధికారి & కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్ ఈమె ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.











