మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
రాష్ట్రంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, USFI నిర్మల్ జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ జూలై 10న "చలో ప్రజా భవన్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 10న నిర్వహించనున్న "చలో ప్రజా భవన్" కార్యక్రమాన్ని విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని USFI నిర్మల్ జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సింది పోయి కార్పొరేట్ విద్యకు ప్రోత్సాహం ఇస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం మోపుతోందని మండిపడ్డారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు వెంటనే పంపిణీ చేయాలని, ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫారాలు అందించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, వార్డెన్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే బీసీ వసతిగృహాల్లో ఆన్లైన్ ప్రవేశ విధానాన్ని రద్దు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్య హక్కును కాపాడుకోవాలంటే పోరాటమే మార్గం. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి విద్యార్థి, యువకుడు జూలై 10న జరిగే "చలో ప్రజా భవన్" కార్యక్రమంలో భారీగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ పిలుపునిచ్చారు.












