నందిపేట (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
నందిపేట మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉల్లి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె నిశ్చితార్థ వేడుక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పి.ఆర్. గార్డెన్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నందిపేట మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉల్లి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె నిశ్చితార్థ వేడుక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పి.ఆర్. గార్డెన్లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్, బోధన్ నియోజకవర్గ ఇంచార్జి దాదన్నగారి విఠల్‌రావు హాజరయ్యారు. నిశ్చితార్థం చేసుకున్న యువజంటను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు నక్కల భూమేష్, ఏ. రామారావు, బి. శ్రీనివాస్ రావు, దషా గౌడ్, భారీ, జే. రాజేష్, నర్సా గౌడ్, విఠల్ గౌడ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, అభిమానులు పాల్గొని నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.












