బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు తుల అరుణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణాకు పరిశీలించాల్సిందిగా వేమ్ నరేందర్ రెడ్డి సూచించారు.
బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు తుల అరుణ్ కుమార్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా తుల అరుణ్ కుమార్ మాట్లాడుతూ, బోథ్ నియోజకవర్గంలోని పది మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేని ఏకైక మండలం సోనాల అని వివరించారు. దీంతో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.
అందువల్ల ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్య అందించే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సోనాల మండలంలో ఏర్పాటు చేయడం అత్యవసరం అని రాజ్యసభ సభ్యులకు వివరించారు.
వినతిని సానుకూలంగా స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డి, తన సమక్షంలోనే రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణాకి ఫోన్ చేసి ఈ ప్రతిపాదనను ప్రత్యేకంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, తుల అరుణ్ కుమార్ సమర్పించిన వినతిపత్రంపై తన ఆమోద సంతకం చేసి సంబంధిత అధికారులకు పంపించారు.
ఈ సందర్భంగా తుల అరుణ్ కుమార్ మాట్లాడుతూ, సోనాల మండల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించిన రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డికి, అలాగే వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించిన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణాకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.











