తానూరు మండలంలోని బొంద్రట్ గ్రామంలో గురువారం ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిందే రవీంద్ర పటేల్ రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలు సద్వినియోగం చేసుకొని మెరుగైన జీవనం సాగించాలని సర్పంచ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ బత్తె శివప్రసాద్, బీజేపీ నాయకులు నాగేందర్ పాటిల్, వార్డు సభ్యులు భోజరామ్ పటేల్, యోగేష్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











