బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
పిల్లల వైద్య నిపుణులు, ముధోల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ కు స్టేట్ లెవెల్ ధన్వంతరి ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయనను ఘనంగా సన్మానించి, అవార్డును అందజేశారు. నాణ్యమైన వైద్య సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.
పిల్లల వైద్య నిపుణులు, ముధోల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ కు స్టేట్ లెవెల్ ధన్వంతరి ఎక్స్లెన్స్ అవార్డు దక్కింది. హైదరాబాదులోని నారాయణగూడలో ఉన్న కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సర్దార్ పటేల్ హాల్ నందు ఆదివారం తెలంగాణ ఆరోగ్య విధానంపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ను ఘనంగా సన్మానించి, అవార్డును అందించారు.
ముధోల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, నాణ్యమైన వైద్య సేవలు అందించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్లు సొసైటీ తెలియజేసింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ను ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ ఎర్ర దామోదర్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సుమల, డాక్టర్ సూర్యకాంత్ రెడ్డి, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ దీపా జాదవ్, ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ వివి హేమంత్ కళ్యాణ్, డాక్టర్ కైలాష్ పతి, డాక్టర్ సుప్రియ, డాక్టర్ రచన, నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల రచయితల సంఘం కన్వీనర్ జాధవ్ పుండలిక్ రావు పాటిల్, ఆరె మరాఠా సంఘం నాయకులు కంఠాలే రఘువీర్ పాటిల్, జీ డీ ఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది, ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు అభినందించారు.












