సారంగాపూర్ మండల కేంద్రంలోని జామ్ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో డిపి ఓ శ్రీనివాస్, డి ఎల్ పి ఓ లింగయ్య, ఎంపీడీవో లక్ష్మీకాంత్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో, నూతనంగా అమలులోకి వచ్చిన ఘణ వ్యర్థ నిర్వహణ నియమాలు-2026 గురించి వివరించారు.
పర్యావరణ పరిశుభ్రతపై గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ నివారణలో భాగంగా, జ్యూట్ బ్యాగ్ ల పంపిణీ చేయడం జరిగింది.
మార్కెట్ ప్రాంతాలలో డస్ట్ బిన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తుల అధిక సంఖ్యలో పాల్గొనడం గమనార్హం.











