రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలంలోని విలాసాగర్ గ్రామంలో శుక్రవారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో జరిగింది.
సర్పంచ్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు.
వివిధ దుకాణాలను సందర్శించి వ్యాపారులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని సూచించారు.
ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్థానంలో పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.












