ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మొక్కలు నాటారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" పర్యావరణ వారోత్సవాల భాగంగా, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది.
ఎమ్మెల్యే బిఎల్ఆర్, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ మరియు వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ తో కలిసి, పట్టణంలో మొక్కలు నాటారు.
గ్రామీణ ప్రాంతంలో, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అటవీ శాఖ అధికారులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా, ఎమ్మెల్యే పచ్చదనం పెంచడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ విపత్తు నుండి మానవాళిని కాపాడుకోవాలని చెప్పారు.












