కనకాపూర్ గ్రామం, మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
లోకేశ్వరం: మండలంలోని కనకాపూర్ గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోని మున్నూరుకాపు సంఘం భవనంలో సంఘ సభ్యుల వార్షిక సమావేశం నిర్వహించారు.
పాత కార్యవర్గం కాలపరిమితి తీరినందున రాబోయే సంవత్సర కాలానికి గాను నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యుల ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షులుగా బోడోల్ల గంగన్న, క్యాషియర్ అంగీర్గ కిషన్, క్యమ దేవేందర్, ఈర్ల రాజు, ఈర్ల హరిష్ రైటర్ లను సంఘ సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.












