నిర్మల్, జూలై 9
విద్యా రంగ సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలైన ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, విద్యార్థుల హక్కుల సాధన కోసం రేపు (జూలై 10) రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేయాలని పిలుపునిచ్చాయి.
విద్యా రంగ సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలైన ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ నిరసన తెలిపాయి. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, విద్యార్థుల హక్కుల సాధన కోసం రేపు (జూలై 10) నిర్వహించ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించాయి. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయడం, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని, కానీ నేడు పాలకులు విద్యారంగాన్ని గాలికొదిలేశారని విమర్శించాయి.
నిర్మల్ జిల్లా ట్రస్మ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, చంద్ర గౌడ్లకు వేర్వేరుగా బంద్ నోటీసులు ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న పీజీ కాలేజీలో తరగతులు నిర్వహించాలని, నిర్మల్ జిల్లా కేంద్రంలో నవోదయ స్కూల్ ను ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశాయి. ప్రైవేట్ స్కూల్స్ కు పుస్తకాలు, నోట్ బుక్స్ ప్రభుత్వమే అందించాలని కోరాయి.











