బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
మండల కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఈ. రాజశేఖర్ విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం ప్రాముఖ్యతను వివరించారు. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయాన్ని, జవాన్ల ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు.
మండల కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఈ. రాజశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత సైన్యం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని, భారత జవాన్లు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను కొనియాడారు.
కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన పరమ్ వీర్ చక్ర గ్రహీతలు కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, రైఫిల్‌మ్యాన్ సంజయ్ కుమార్‌తో పాటు అమరవీరులందరికీ రెండు నిమిషాల మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ కోచ్ డేవిడ్, అధ్యాపకులు ప్రశాంత్, మల్లిక తదితరులు పాల్గొన్నారు.












