ముధోల్, 25 July
ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) అధ్యయన కేంద్రంగా ఎంపికైంది. ఈ నిర్ణయంతో స్థానిక విద్యార్థులు ఉన్నత విద్యను స్థానికంగానే అభ్యసించే అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు ప్రిన్సిపాల్, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు.
ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) అధ్యయన కేంద్రంగా ఎంపిక చేయడం పట్ల స్థానిక విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అధ్యయన కేంద్రం ఏర్పాటుతో ముధోల్, పరిసర ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యను స్థానికంగానే అభ్యసించే అవకాశం కలగనుంది.
ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల బుచ్చయ్య, కోర్డినేటర్ డా.పవన్ పాండే, అధ్యాపకులు డా.ch సంజీవ్ కుమార్ లు మాట్లాడుతూ, అధ్యయన కేంద్రం మంజూరుకు సహకరించిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు అధ్యాపక బృందం ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ముధోల్ గ్రామ ప్రజలు, ముధోల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ అధ్యయన కేంద్రం ద్వారా ఉద్యోగులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తమ ఉద్యోగాలు, ఇతర పనులను చేసుకుంటూనే ఉన్నత విద్యను అభ్యసించే వీలు కలుగుతుంది.












