కామారెడ్డి, 3 September
లోని ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో ప్రారంభ్ ఉత్సవ్2026 పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో సందడి చేశారు.
ఆర్కే విద్యాసంస్థల్లో ఘనంగా ‘ప్రారంభ్ ఉత్సవ్–2026’ , సెప్టెంబరు 3: పట్టణంలోని ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ‘ప్రారంభ్ ఉత్సవ్–2026’ పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలకు చెందిన జూనియర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో సందడి చేశారు. రజతోత్సవ వేడుకలకు శ్రీకారం ఆర్కే విద్యాసంస్థలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది రజతోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టినట్లు సంస్థ సీఈఓ డాక్టర్ ఎం. జైపాల్‌రెడ్డి తెలిపారు. గత 24 ఏళ్లలో సంస్థలో విద్యనభ్యసించిన పలువురు విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యార్థులు సైతం క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ గిరి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి జిల్లాకు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం, మై భారత్ జిల్లా యువజన అధికారి రమేష్, డీవైఎస్వో వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అపర్ణ, విద్యావర్ధిని ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సురేష్‌బాబు, లిరిక్ రైటర్, ప్రజాకవి జయరాజ్ ‘గెస్ట్ ఆఫ్ హానర్స్’గా పాల్గొని విద్యార్థులను అలరించారు. కార్యక్రమంలో కళాశాల గ్రూప్ చైర్మన్ భాస్కర్‌రావుతో పాటు వివిధ విభాగాల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, హెచ్ఓడీలు, సీనియర్ లెక్చరర్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.











