రామారెడ్డి, 3 September
మండలం రెడ్డిపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
రెడ్డిపేట్ పాఠశాలలో పోలీసుల అవగాహన కార్యక్రమం ప్రేమలు, మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన , సెప్టెంబర్ 3 ( మండలం రెడ్డిపేట్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎస్ఐ మురళి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. విద్యార్థులు మంచి లక్ష్యంతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని, చిన్నపాటి తప్పిదాలు సైతం జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పే సూచనలను పాటించాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని సూచించారు. మూఢనమ్మకాలను విడనాడి సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ ఆలోచనలను అలవర్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని తెలిపారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు, మాదక ద్రవ్యాల సంబంధిత సమాచారానికి 1908కు, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ 8712686094 నంబర్‌కు సమాచారం అందించాలని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112కు కాల్ చేయాలని సూచించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషారావు, పోలీస్ కానిస్టేబుల్స్ ప్రభాకర్, యు. సాయిలు మాటలు, పాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మానవ అక్రమ రవాణా అంశంపై పీసీ రాజేందర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.












