చిన్నచింతకుంట, 27 July
చిన్నచింతకుంటలోని కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ఘాట్ రోడ్డు పనులను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి (జీఎంఆర్) శనివారం పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్మాణాలకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.110 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ఘాట్ రోడ్డు పనులను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి (జీఎంఆర్) శనివారం పరిశీలించారు. ఆర్అండ్బీ ఈఎన్సీ బీవీ రావు, ఎస్ఈ రాజేందర్ తదితర అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.
అనంతరం ఏకాదశి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం ఎలివేటెడ్ కారిడార్, ఘాట్ రోడ్డు నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.110 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
పనులు వేగంగా కొనసాగుతున్నాయని, బ్రహ్మోత్సవాల నాటికి ఆలయం వద్ద వంతెన నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. వచ్చే జూలై నాటికి ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ఘాట్ రోడ్డు పనులు పూర్తి చేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.












