భైంసా, జూలై 5
భైంసా పట్టణంలోని గణేష్‌నగర్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పుట్టపోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని రైతులు, ప్రజలు అమ్మవారిని వేడుకున్నారు.
భైంసా పట్టణంలోని గణేష్‌నగర్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పుట్టపోచమ్మ పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని రైతుల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తోట రాము మాట్లాడుతూ రైతులకు అనుకూలంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నారాయణ, పెరుగు ముత్తెన్న, సాయినాథ్, రాజు, రాము, బోసి నారాయణతో పాటు పలువురు రైతు సోదరులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.












