*🌴 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 05
శ్రీ గురుభ్యోనమః. 05-07-2026 ఆదివారం నాడు మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి సంబంధించిన రాశిఫలాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈరోజు మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, గృహంలో శుభకార్యాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం వంటివి మేషరాశి వారికి అనుకూలిస్తాయి. వృషభ రాశి వారికి రుణాల ఒత్తిడి, జీవిత భాగస్వామితో వివాదాలు, పని ఒత్తిడి వంటివి ఉంటాయి.
శ్రీ గురుభ్యోనమః. 05-07-2026 ఆదివారం నాటి రాశిఫలాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. సోదరులతో స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి. బంధుమిత్రుల మాటలు మానసిక చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు.
ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సహాయం అందుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.












