👉🏻 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 05
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, శిలాతోరణం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు సుమారు 18 నుండి 20 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, శిలాతోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు సుమారు 18 నుండి 20 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల శీఘ్రదర్శనంకు 3 నుండి 5 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 90,546 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,303 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹3.93 కోట్లుగా నమోదైంది. మొత్తం 4.61 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.54 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య 3,162గా ఉంది.












