భైంసా, జూలై 4
భైంసా నుంచి పండరిపూర్కు పాదయాత్రగా బయలుదేరిన భక్తులకు శనివారం భైంసాలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భక్తులకు శాలువాలు కప్పి సన్మానించి పాదయాత్రను ప్రారంభించారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం నియమనిష్ఠలతో నిర్వహించే ఈ యాత్ర భక్తి, క్రమశిక్షణ, సేవాభావం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.
భైంసా నుంచి పండరిపూర్కు పాదయాత్రగా బయలుదేరిన భక్తులకు శనివారం భైంసాలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భక్తులకు శాలువాలు కప్పి సన్మానించి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం నియమనిష్ఠలతో నిర్వహించే పండరిపూర్ దిండి పాదయాత్ర భక్తి, క్రమశిక్షణ, సేవాభావం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ యాత్రలో పాల్గొనడం ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనతో పాటు ఐక్యతా భావం మరింత పెంపొందుతుందని పేర్కొన్నారు.
ఆషాఢ ఏకాదశి సందర్భంగా నిర్వహించే పండరిపూర్ పాదయాత్రలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, దేశంలోనే ఇది విశిష్టమైన ఆధ్యాత్మిక సంప్రదాయంగా గుర్తింపు పొందిందని తెలిపారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.












