బాసర, జులై 2
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో గురువారం హుండీలను లెక్కించగా, గత 49 రోజుల కాలానికి రూ.1,06,45,359 ఆదాయం సమకూరింది. ఆలయ కార్యనిర్వాహణ అధికారి అంజనీదేవి ఈ వివరాలను వెల్లడించారు.
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో గురువారం హుండీలను లెక్కించగా, గత 49 రోజుల కాలానికి రూ.1,06,45,359 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి అంజనీదేవి వెల్లడించారు.
అలాగే హుండీల ద్వారా 78 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల మిశ్రమ వెండి, 17 విదేశీ కరెన్సీ నోట్లు భక్తులు కానుకగా సమర్పించినట్లు ఆమె తెలిపారు.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ నిర్మల్ జిల్లా పరిశీలకుడు ఆర్. రవికిషోర్, ఆలయ సహాయ కార్యనిర్వాహణ అధికారి జి. గంగాశ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శివరాజ్, సంజీవ్‌రావు, ఆలయ వైదిక, పరిపాలన సిబ్బంది, తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు, బాసర పోలీసులు, హోంగార్డులు, వాగ్దేవి సేవా సంఘం సభ్యులు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన సేవకులు పాల్గొన్నారు.












