*🌴 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
03-07-2026, శుక్రవారం నాడు మేషం నుండి మీనం వరకు రాశిఫలాలు వెలువడ్డాయి. ప్రతి రాశికి సంబంధించిన ఆదాయ, ఉద్యోగ, కుటుంబ, ఆరోగ్య, వ్యాపార, ఆర్థిక విషయాలపై సూచనలు ఇవ్వబడ్డాయి.
శ్రీ గురుభ్యోనమః. 03-07-2026, శుక్రవారం నాడు మేషం నుండి మీనం వరకు రాశిఫలాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు తగినంత దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది.
సన్నిహితుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. గృహమునకు బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమైన సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారములను విస్తరించి లాభాలు అందుకుంటారు.












