మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 06
ప్రభుత్వ అధికారులను మోసం చేసేందుకు, ఫైనాన్స్ కంపెనీ సీజ్ నుంచి తప్పించుకోవడానికి, ట్రాఫిక్ చలానాల నుంచి బయటపడటానికి ఒకే నంబర్ ప్లేట్‌తో మూడు హోండా యాక్టివాలను ఉపయోగించిన ముగ్గురు వ్యక్తులను చార్మినార్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. TS09 FE 4997 నంబర్‌ను మూడు వాహనాలకు అమర్చినట్లు గుర్తించారు.
ప్రభుత్వ అధికారులను మోసం చేసేందుకు ఒకే నంబర్ ప్లేట్‌తో మూడు హోండా యాక్టివాలను ఉపయోగించిన ముగ్గురు నిందితులను చార్మినార్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. TS09 FE 4997 నంబర్‌ను మూడు వాహనాలకు అమర్చినట్లు గుర్తించారు. ఫైనాన్స్ కంపెనీ సీజ్ నుంచి తప్పించుకోవడానికి, ట్రాఫిక్ చలానాల నుంచి బయటపడటానికి ఈ నకిలీ నంబర్ ప్లేట్ ఎత్తుగడ వేశారని అధికారులు తెలిపారు.
ఈ కుట్రతో ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బట్టబయలైంది. మూడు హోండా యాక్టివా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారాసిగూడ పోలీస్ స్టేషన్లో BNS 318(4), 316(2) కింద కేసు నమోదు చేశారు. చార్మినార్ టాస్క్‌ఫోర్స్, వారాసిగూడ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును ఛేదించారు.












