హైదరాబాద్, జులై 06
హైదరాబాద్లో జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ సోమవారం నాంపల్లి కోర్టులో జరగనుంది. నిందితులందరూ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, హీరో అల్లు అర్జున్ నేరుగా విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్లో జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ సోమవారం నాంపల్లి కోర్టులో జరగనుంది. నిందితులందరూ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నేరుగా హాజరవుతారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
కేసుకు సంబంధించి నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గత విచారణ సందర్భంగా అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టు ముందు హాజరయ్యారు. అయితే, కేసులో ఉన్న ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను నాంపల్లి కోర్టు నేటికి వాయిదా వేసింది.
ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారు. వారందరూ కోర్టుకు హాజరైన తర్వాతే తదుపరి విచారణ ప్రక్రియను కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో నేటి విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. అల్లు అర్జున్ కూడా ఈరోజు జరిగే విచారణకు ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ విధానంలోనే హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలోనే ఉన్నట్లు తెలిసింది.












