పెద్దపల్లి, జూలై 10
పెద్దపల్లి జిల్లా సుల్తా నాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో భర్తను భార్యే హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. వేధింపులు తట్టుకోలేక భార్య మట్టి పెల్లలతో భర్త తలపై కొట్టి చంపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తా నాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక భార్య తన భర్తను మట్టి పెల్లలతో కొట్టి చంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదంబపూర్ (కాశిపల్లి) గ్రామానికి చెందిన సయ్యద్ గోరేమియా, అతని భార్య గోరిబీ మధ్య ఇంటి కలహాలతో గత సంవత్సర కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
గోరేమియా కొంతకాలంగా బయట ఉంటుండగా, రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. వేధింపులు తట్టుకోలేక భార్య గోరేబి, మట్టి పెల్లలతో భర్త తలపై కొట్టి చంపింది. ఈ ఘటనలో సయ్యద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య గోరేబి, కుమారుడు సయ్యద్అలీని అదుపులోకి తీసుకున్నారు. వేధింపుల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.












