Hyderabad/Shaikpet (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
కేశంపేట పోలీ టేషన పరిధిలో చైన నచింగకు పలపడుతునన ముగగురు భయుల అంతరరషటర ముఠను పోలీులు అరెట చేశరు. ీరి నుంచి 7 తులల బంగరు గొలుులు, మూడు ెలఫోనలు, ఒక దిచకర హనం, రెండు కతతులు ధీనం చేుకుననరు. ఈ ముఠ పంజబ రషటరనికి చెందినదిగ గురతించరు.
కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్ సిటీ కమిషనరేట్ పరిధిలోని కేశంపేట, కడ్తాల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ, సుమారు 7 తులాల బంగారు గొలుసులు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్థానిక డిసిపి శిరీష రాఘవేంద్ర, ఏసిపి లక్ష్మీనారాయణ, కేశంపేట సీఐ నరహరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్‌దేవ్ సింగ్ (38), షమ్షేర్ సింగ్ (36), మన్‌ప్రీత్ సింగ్ (24) హార్వెస్టర్ డ్రైవర్లు, కూలీలుగా పనిచేస్తూ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలపై అవగాహన పెంచుకున్నారు. స్థానిక రహదారులు, గ్రామాలు, మార్గాలు, తప్పించుకునే దారులపై పరిచయం ఏర్పడటంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
జూలై 25న కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ శివారులో ఓ వృద్ధురాలు తన మనవరాలితో కలిసి వెళ్తుండగా.. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు దారి అడిగినట్లు నటించి, ఒక్కసారిగా ఆమె మెడలోని 4 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. అదే రోజు కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మరో మహిళను బెదిరించి, కింద పడేసి ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెలతాడును అపహరించినట్లు విచారణలో వెల్లడైంది.
జూన్ నెలలో కొత్తకోట ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి, అదే వాహనంతో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. అనంతరం చోరీ చేసిన బంగారు ఆభరణాలను విక్రయించి డబ్బును పంచుకున్నట్లు వెల్లడించారు. జూలై 23న నాందేడ్ నుంచి సికింద్రాబాద్‌కు రైలులో వచ్చిన నిందితులు, అక్కడి నుంచి మరోసారి నేరాలకు పాల్పడేందుకు సిద్ధమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. జూలై 24న మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద పార్క్ చేసిన హోండా సీడీ-100 ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి, దానితో కేశంపేట, కడ్తాల్ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు.
మరో చైన్ స్నాచింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 29న కేశంపేట ఎక్స్ రోడ్డు వద్ద ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో కేశంపేట, కడ్తాల్, మహబూబ్‌నగర్ టౌన్, కొత్తకోట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు కేసులకు సంబంధించి నిందితులు తమ ప్రమేయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.











