హైదరాబాద్, 2023-09-01
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌట్పల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఉకే శిరీష హత్యపై ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శిరీషకు నివాళులు అర్పించి, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

తుడుం దెబ్బ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పీహెచ్డీ విద్యార్థి, ఆదివాసీ విద్యార్థి పోరం రాష్ట్ర అధ్యక్షుడు మడవి అజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
శిరీష హత్య వెనుక మరికొందరి ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయని, ఉన్నతస్థాయి దర్యాప్తు చేసి నిజానిజాలు వెలికితీయాలని నాయకులు కోరారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. నిందితుడిపై చట్టపరంగా కఠిన శిక్ష విధించాలని, శిరీషకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు సీ. కాశిం, డాక్టర్ వంశీధర్, ఏపీకే నాగేశ్వర్రావు, ఏఎస్యూ నాయకుడు కుడ్మేత వినోద్ తదితరులు పాల్గొన్నారు.