Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
సమాజ శ్రేయస్సు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుల అడుగుజాడల్లో నడవాలని తానూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జాదవ్ సుగంధ మాధవరావు పాటిల్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో డాక్టర్ అన్నాభావూ సాఠే 106వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
సమాజ శ్రేయస్సు కోసం, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని తానూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జాదవ్ సుగంధ మాధవరావు పాటిల్ పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో డాక్టర్ అన్నాభావూ సాఠే 106వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ప్రత్యేక పూజలు చేసి అన్నాభావూ సాఠే జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గౌతమ బుద్ధుని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తానూర్ మండల అధ్యక్షుడు హెచ్. పుండలీక్, పంచాయతీ కార్యదర్శి, బిజెపి నాయకులు శివాజీ పాటిల్, మాజీ జడ్పీటీసీ ఉత్తం భలేరావు, మాజీ సర్పంచులు తాడేవార్ విఠల్, రాములు భీమ్ పవార్, బండారే సోమనాథ్, గోవింద్ పాటిల్, పండరి పాల్గొన్నారు.
అలాగే అన్నాభావూ సాఠే కమిటీ అధ్యక్షుడు చందు వాగ్మారే, ఉపాధ్యక్షుడు సురేష్ బైల్కర్, కోశాధికారి శాయాజీ వాగ్మారే, కమిటీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.












