భైంసా, 1 August
బహుజన్ సాహిత్య ఉద్యమ మార్గదర్శకుడు, కార్మిక, దళిత ప్రజల గొంతుకగా నిలిచిన అన్నా భాహు సాఠే గారి 105వ జయంతిని భైంసా పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బహుజన్ సాహిత్య ఉద్యమానికి మార్గదర్శకుడు, కార్మిక, దళిత ప్రజల గొంతుక అయిన అన్నా భాహు సాఠే గారి 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నబాహు సాటే సంఘం ఆధ్వర్యంలో భైంసా పట్టణంలోని అన్నా భావు సాఠే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు హాజరై మాట్లాడారు. అన్నా భాహు సాఠే పేదరికంలో పుట్టి, కూలీగా పని చేస్తూనే గొప్ప రచయిత అయ్యారని, దళిత, కార్మిక వర్గాల బాధలను ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. ఆయన త్యాగం నేటికీ కార్మికుల పోరాటానికి స్ఫూర్తినిస్తోందని కొనియాడారు.
అన్నా భాహు సాఠే చదువే సమానత్వానికి మార్గం అని నమ్మారని, ఆయన ఆశయాలైన సామాజిక సమానత్వం, విద్య, ఆత్మగౌరవం కోసం మనం పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయన కలమే ఆయుధం అని చాటి, పేద, దళిత, కార్మిక ప్రజల జీవితాలను తన రచనలతో వెలుగులోకి తెచ్చారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరం ఆచరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అన్నబాహు సాటే కమిటీ నాయకులు కొత్తూరు శంకర్, సాహెబ్ రావ్, మారుతి, బాబు, కాంబ్లె సాహెబ్ రావ్, లక్ష్మణ్, రవి, నాగేష్, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నా భావు సాఠే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. జై భీమ్! జై అన్నా భావు సాఠే!












