భైంసా, 1 August
సాహిత్య రత్న, లోక్సహిర్, విప్లవ కళాకారుడిగా పేరొందిన డాక్టర్ లోక్షాహిర్ అన్నబాహు సాటే గారి జయంతిని భైంసాలో ఘనంగా నిర్వహించారు. ఒకటిన్నర రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లిన ఆయన, తన కవిత్వాలు, నాటకాల ద్వారా అణగారిన వర్గాల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చారు.
సాహిత్య రత్న, లోక్సహిర్, విప్లవ కళాకారుడు డాక్టర్ లోక్షాహిర్ అన్నబాహు సాటే గారి జయంతిని భైంసాలో ఘనంగా నిర్వహించారు. ఒకటిన్నర రోజులు మాత్రమే బడికి వెళ్లినప్పటికీ, తన కవిత్వాలు, నాటకాల ద్వారా అణగారిన వర్గాల (కార్మిక, కర్షక) జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన గొప్ప కవి ఆయన.
చత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతిబాపూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, లాహుజీ వాస్తాద్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి డాక్టర్ అన్నబాహు సాటే.
ఈ కార్యక్రమంలో భైంసా అన్నభావు సాటె కమిటీ సభ్యులు కొత్తురు శంకర్, పూజారి లక్ష్మణ్, సుంకెట పోశెట్టి, గాడెకర్ బాబు, సాహెబ్ రావు, మారుతి, నాగెష్ తో పాటు దళిత నాయకులు, సామజిక వేత్తలు పాల్గొన్నారు.












