లోకేశ్వరం, 3 September
మండల కేంద్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ధార్వాడి కపిల్ ప్రారంభించారు. ఎంపికైన లబ్ధిదారుల స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి మార్కౌట్ ఇచ్చి భూమిపూజ నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్లకు సర్పంచ్ శ్రీకారం , సెప్టెంబరు 3: (మనోరంజని తెలుగు టైమ్స్) ప్రతినిధి (అంబకంటి శ్రీనివాస్) మండల కేంద్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్ ధార్వాడి కపిల్ శ్రీకారం చుట్టారు. ఎంపికైన లబ్ధిదారుల స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి మార్కౌట్ ఇచ్చి భూమిపూజ నిర్వహించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కపిల్ సూచించారు. గ్రామాభివృద్ధితో పాటు అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రాజేశ్వర్,ఉప సర్పంచ్ లక్కంపల్లి లక్ష్మి, , వార్డ్ మెంబర్లు, విజయరావు, సవిన్, పనిల్ రావు భోజన్న తదితరులు పాల్గొన్నారు.












