"* (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
బిసి సమాజ ఆర్థిక వికాసానికి, ఐక్యతకు, కుమ్మర సామాజిక వర్గం అభివృద్ధికి, హక్కుల సాధనకు జీవితాంతం కృషిచేసిన సామాజిక విప్లవకారుడు, కుమ్మర జాతి పిత దివంగత జాలిగామ ఈశ్వరయ్య అని నేదునూరి కనకయ్య కొనియాడారు. ఆయన 93వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో సరూర్నగర్ లోని కుమ్మర విద్యార్థుల వసతి గృహంలో ఘనంగా జరిగాయి.
బిసి సమాజ ఆర్థిక వికాసానికి, ఐక్యతకు, కుమ్మర సామాజిక వర్గం సామాజిక ఆర్థిక అభివృద్ధికి, హక్కుల సాధనకు జీవితాంతం కృషిచేసిన సామాజిక విప్లవకారుడు, కుమ్మర జాతి పిత దివంగత జాలిగామ ఈశ్వరయ్య అని, వారి సేవలను నేదునూరి కనకయ్య కొనియాడారు.
నేడు కీర్తిశేషులు జాలిగామ ఈశ్వరయ్య గారి 93వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో, అద్యక్షులు ధరిపెల్లి మహేందర్ అధ్యక్షతన, కుమ్మర విద్యార్థుల వసతి గృహం సరూర్నగర్ లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కుమ్మర సంఘం నాయకులు, మేధావులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈశ్వరయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చా వేదికలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ పత్రిక రచయిత, కాలమిస్ట్, తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు నేదునూరి కనకయ్య మాట్లాడుతూ, జాలిగామ మహేశ్వరయ్య గారు ఆశించిన విధంగా కుమ్మర సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని, చట్టసభల్లో కుమ్మర్ల జనాభాకు తగిన ప్రాతినిధ్యం దక్కించుకోవడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కుమ్మరి కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెంది, విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని, వారి సామాజిక అభివృద్ధికి ప్రభుత్వాలు హాస్టల్లో, స్కాలర్షిప్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రధానవక్తగా పాల్గొన్న తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 'తెలంగాణ రాష్ట్ర కుమ్మర ఆత్మ గౌరవ భవన్' ఉపాధ్యక్షులు కొల్లూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ, సాంప్రదాయ కుమ్మర వృత్తిని నమ్ముకున్న కుటుంబాలను ఆదుకోవడానికి, కుండలు తయారు చేయడానికి ఉచితంగా మట్టి సేకరించడానికి, మట్టి పాత్రలు కాల్చడానికి, వృత్తి మీద వేసే పన్నును మినహాయించడానికి ప్రభుత్వ జీవోలను సాధించడంలో ఈశ్వరయ్య చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. ప్రభుత్వం కుమ్మరి వృత్తికి ఆధునిక సాంకేతికతను జోడించాలని, కుమ్మర్ల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, రుణ సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, విద్యా, ఉద్యోగ, ఉపాధి పరంగా వెనుకబడిన కుమ్మరి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుమ్మర్ల హక్కుల రక్షణే ధ్యేయంగా, కుమ్మర కులస్తుల చైతన్యమే లక్ష్యంగా నిరంతరం పనిచేసి సమాజ సేవలో అమరులైన వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే వారికి ఈ తరం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర కుమ్మర ఆత్మ గౌరవ భవన్ సభ్యులు అశోక్ మాట్లాడుతూ, జాలిగామ ఈశ్వరయ్య కుమ్మర సంఘం కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి, పేద కుమ్మర వృత్తిదారుల్లో ఐక్యతను, సౌహార్దతను, కుమ్మర హక్కుల పట్ల చైతన్యం కల్పించిన చైతన్య శక్తి ఈశ్వరయ్య గారని అన్నారు.












