కరీంనగర్, 29 July
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం (జూలై 30) సందర్భంగా తెలంగాణ వికాస వేదిక అధ్యక్షులు, రచయిత, కాలమిస్ట్ నేదునూరి కనకయ్య స్నేహం ప్రాముఖ్యతను వివరించారు. స్నేహం మధురం, ధైర్యం, జీవన యానంలో ఒక శ్వాస వంటిదని, కష్టసుఖాల్లో అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.
స్నేహం మధురం, ధైర్యం, జీవన యానంలో ఒక శ్వాస వంటిదని, కష్టసుఖాల్లో అండగా నిలుస్తుందని తెలంగాణ వికాస వేదిక అధ్యక్షులు, రచయిత, కాలమిస్ట్, మాజీ ఎన్ఎస్ఎస్ అధికారి నేదునూరి కనకయ్య అన్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం (జూలై 30) సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కల్లా కపటం ఎరుగని స్నేహం హృదయంలో నిండుగా ఆనందాన్ని, అహల్లాదాన్ని పంచుతుందని, ప్రకృతిలా మనల్ని రక్షించేదని ఆయన పేర్కొన్నారు. కుల, మత, పేద, ధనిక, ప్రాంత, భాషా భేదాలు తెలియని బంధం స్నేహం అని, ఇది రక్త సంబంధాలను మించినదని అన్నారు. స్నేహం లేని జీవితం బేజారు అని, మార్కెట్లో స్నేహం కొనలేమని, పరస్పర అవగాహన, గౌరవం స్నేహానికి వారధి అని తెలిపారు.
స్నేహంతో బాధలు పరారవుతాయని, మనశ్శాంతి ఖరారవుతుందని, స్నేహం లేని జీవితం బేఖారు అవుతుందని ఆయన అన్నారు. సృష్టిలో తీయని స్నేహ దీపాన్ని వెలిగించి, ప్రగతి, పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు.
శాంతి, సహనం, సామరస్యం, ఐక్యత, సమైక్యత, ఆర్ధత, అవగాహన, సంఘీభావంతో స్నేహపూర్వక సమాజాన్ని నిర్మిద్దామని, అందోళన రహిత సమాజాన్ని సృష్టిద్దామని ఆయన సూచించారు. విద్వేషాలను ఆపి, విచ్ఛిన్నకర శక్తుల ఆట కట్టిస్తామని, స్నేహ సౌహార్థతతో దేశ ప్రగతిని సాధిద్దామని అన్నారు. స్నేహం పునాదుల మీద విశ్వ శాంతిని సాధించి, భారత జాతి ఖ్యాతిని జగతిన చాటుదామని నేదునూరి కనకయ్య ఆకాంక్షించారు.












