జిల్లా కేంద్రం (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
జీవనోపాధి కోసం తమకు కేటాయించిన భీమన్న గుట్టను తిరిగి తమకే ఇవ్వాలని ముదిరాజులు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను బుధవారం కోరారు. పాలకవర్గాలు, ప్రభుత్వం కబ్జా చేశాయని, తమ పోరాటాన్ని పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 15 తర్వాత నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
జీవనోపాధి కోసం తమకు కేటాయించిన భీమన్న గుట్టను తిరిగి తమకే ఇవ్వాలని ముదిరాజులు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను బుధవారం కోరారు. ఈ మేరకు వారు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ కుల సంఘం ప్రతినిధి యాటకారి సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ, ఏళ్ల క్రితం తమ బతుకు దెరువు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని పాలకవర్గాలు కబ్జా చేశాయని, ఇప్పటికే కొంత భాగాన్ని ప్రభుత్వం కూడా తీసుకుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ తాతల కాలం నుండి ఆ భూమి తమకే చెందాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టు 15 తర్వాత ముదిరాజు కుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ చేపట్టి, ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకరి పోతన్న, సుంకరి సాయి, మందుల పోశెట్టి, అడ్వకేట్ గొడుగు గంగాధర్ ముదిరాజ్, సర్పంచ్ సట్ల భూమేష్, ముధోల్ భూమన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.












