యాదాద్రి భువనగిరి, 29 July
ప్రకృతితో మమేకమై, అడవిని తమ ఊరుగా, కొండలను గోడలుగా చేసుకుని జీవించే ఆదివాసీల జీవితాన్ని, వారి సంస్కృతిని గౌరవించాలని రచయిత్రి మంజుల పత్తిపాటి పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరుతో వారి జీవన విధానాన్ని దెబ్బతీయడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
వారి గుడిసె చిన్నదై ఉండవచ్చు... కానీ మా హృదయం విశ్వం అంత విశాలం! అడవే వారి ఊరు, ప్రకృతే వారి శ్వాస. కొండలే వారి గోడలు, పచ్చని చెట్ల మధ్యే వారి జీవితం.
నదుల నడకలో నాగరికతను చూసినవారు, అడవుల నిశ్శబ్దంలో జీవన వేదాన్ని చదివినవారు. ఆకాశం మొదటి నీలిమను ధరించినవారు, భూమి తొలి పరిమళాన్ని ఆస్వాదించినవారు.
పక్షుల పాటలతో మేల్కొనే వారి ఉదయం. చెట్ల నరికివేతతో వారి సంతోషాన్ని మనం చెరచాం. వాగుల గలగలలతో సాగే వారి జీవనం. అభివృద్ధి పేరుతో వారి అడుగులను మనం చెరచాం.
ఓ సమాజమా... వారి ఉనికిని కనికరంతో చూడకు, గౌరవంతో ఆలింగనం చేసుకో. వారి సంస్కృతిని మ్యూజియంలో దాచకు, భవిష్యత్తు తరాలకు వెలుగుగా అందించుకో.
అడవులని కాపాడుకుందాం, ఆదివాసిలకు అండగా నిలుద్దాం.
రచన: మంజుల పత్తిపాటి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. చరవాణి 9347042218.












