ఆర్మూర్, జూలై 10
ఆర్మూర్ పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో 9 మంది డైరెక్టర్లు ఘన విజయం సాధించారు. మొత్తం 214 ఓట్లకు గాను 198 ఓట్లు పోలవ్వగా, 194 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఎన్నికల అధికారి సాయికుమార్ గౌడ్ ఫలితాలను ప్రకటించారు.
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్దగల పట్టు చేనేత సహకార సంఘంలో నిర్వహించిన ఎన్నికలలో 9 మంది డైరెక్టర్లు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సాయికుమార్ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ లోని పట్టు చేనేత సహకార సంఘంలో శుక్రవారం ఈ ఎన్నికలు జరిగాయి. సంఘంలో మొత్తం 214 ఓట్లకు గాను 198 ఓట్లు పోలయ్యాయి. అందులో నాలుగు ఓట్లు చెల్లనివి కాగా, 194 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి.
గెలుపొందిన డైరెక్టర్లలో గంగా మోహన్ చక్రు (153 ఓట్లు), షికారి శ్రీనివాస్ (136), పడాల్ గణేష్ (132), పోహార్ శైలేష్ (129), పడాల్ నరేందర్ (126), ఖాందేశ్ సత్యం (124), వందన లక్ష్మీనారాయణ (123), బాదం రాజ్ కుమార్ (110), బచ్చేవాల్ రెడ్డి నూతన్ శ్రీనివాస్ (104) ఓట్లు సాధించారు. ఈ ఎన్నికలలో మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 9 మంది డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు.
ఓటమి చెందిన అభ్యర్థులలో కర్తన్ గణేశ్యామ్ (98), కర్తన్ గంగా మోహన్ (47), కోడె స్వామి (60), సుఖేష్ వర్మ (66), పోహార్ రాజ్ కరణ్ (91), పోహార్ విటోబా శేఖర్ (96), సాత్ పుతే సంతోష్ (73) ఉన్నారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. గంగా మోహన్ చక్రు, పడాల్ గణేష్ వర్గాల మద్దతుదారులు ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలించి ఓట్లు వేయించుకోవాలని ప్రచారం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద హోరాహోరీగా ప్రచారం సాగింది. ఎన్నికల అధికారి సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు ఫలితాలను వెల్లడించి విజేతల పేర్లను ప్రకటించారు.
గెలుపొందిన 9 మంది డైరెక్టర్లకు ఎన్నికల అధికారి గెలుపొందిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా క్షత్రియ ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, 9 మంది నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. గోల్ బంగ్లా వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి ప్రకాష్, బారడ్ గంగా మోహన్, కోశాధికారి వైద్య సంజయ్, కౌన్సిలర్ పాన్ శ్రీనివాస్, జెస్సు ఆనంద్, బారడ్ కిషోర్, పోహార్ భరత్, పోహార్ నవీన్, బారడ్ కిరణ్, హజారి రూపేష్, గటడి గంగా మోహన్, జెస్సు వినోద్, కర్తన్ ప్రకాష్ ఇంజనీర్, ఎస్ జి రాము, విశ్వనాథ్ శ్రీను రాజేష్, జీవి గౌతమ్, జనార్ధన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.












