హైదరాబాద్, జులై 09
దేశంలో అత్యధిక విలువ కలిగిన రూ.2,000 నోట్ల చలామణికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక ప్రకటన చేసింది. మార్కెట్లో చలామణిలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో దాదాపు 98.47 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి విజయవంతంగా వెనక్కి వచ్చినట్లు RBI స్పష్టం చేసింది. ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని, ఖాతాల్లో జమ చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది.
దేశంలో అత్యధిక విలువ కలిగిన రూ.2,000 నోట్ల చలామణికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కీలకమైన అధికారిక ప్రకటన విడుదల చేసింది. మార్కెట్లో చలామణిలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో దాదాపు 98.47 శాతం నోట్లు విజయవంతంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెనక్కి వచ్చినట్లు దేశ కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది.
దాదాపు మూడేళ్ల క్రితం కరెన్సీ నిర్వహణ పరిపాలనా వ్యూహంలో భాగంగా ఈ పింక్ కలర్ పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ, తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్స గణాంకాలను ప్రజల ముందుకు ఉంచింది.
క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2023 మే 19వ తేదీన రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన ఆరంభ సమయంలో మార్కెట్లో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. కాలక్రమేణా బ్యాంకులు మరియు నిర్దేశిత కేంద్రాల ద్వారా ఈ నోట్ల డిపాజిట్లు నిరంతరాయంగా కొనసాగడంతో, తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ నాటికి మార్కెట్లో ఇంకా తిరిగి రాకుండా మిగిలి ఉన్న నోట్ల విలువ కేవలం రూ.5,451 కోట్లకు పడిపోయిందని ఆర్బీఐ వెల్లడించింది.
రూ.2000 నోట్లు మార్కెట్ చలామణి నుండి ఉపసంహరించుకున్నప్పటికీ అవి ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒకవేళ ఎవరి వద్దనైనా ఇంకా రూ.2,000 నోట్లు మిగిలి ఉంటే వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరగా రూ.2,000 నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది.












